ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన నేను ప్రజాసేవకుడిగానే పనిచేస్తానే తప్ప పాలకుడిగా ఉండబోనని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు ప్రజా పాలన రెండో రోజు కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణం 10వార్డు నాగవరంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారుకాంగ్రెస్ పార్టీ నిరుపేదల అభ్యున్నతి కోసం పాటుపడి ఉందని ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనే ముఖ్య ఉద్దేశంతోనే ముందుకెళ్తుందన్నారుకాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలను నిరుపేదలందరికీ అందాలనే ఉద్దేశంతోనే ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టారని ఈ ప్రజా పాలన కార్యక్రమంలో ప్రతి ఒక్క నిరుపేద అవసరం ఉన్న పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటారని ఎవరు ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా ప్రతి ఒక్కరు వారికి అవసరం ఉన్న పథకం గురించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారుకార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ జయసుధ మధు గౌడ్, చీర్ల చందర్, కౌన్సిలర్లు బ్రహ్మం చారి విభూది నారాయణ, లక్ష్మీ రవి యాదవ్, చీర్ల సత్యం సాగర్, కోఆప్షన్ సభ్యురాలు కైరున్ షఫీ, సింగల్ విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పట్టణ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, వాల్మీకి సంఘం అధ్యక్షులు చిన్న రాములు, నాయకులు లక్కాకుల సతీష్ సత్యం తదితరులు పాల్గొన్నారు.