పాలమూరు న్యాయ యాత్ర :: నవాబ్ పేట్

CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారికి ఘనస్వాగతం పలికిన నవాబ్ పేట్ మండల ప్రజలు…

పాలమూరు న్యాయ యాత్ర 12వ రోజులో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్, జడ్చర్ల నియోజకవర్గం, నవాబ్ పేట్ మండలంలోని చల్లా వంశీచంద్ రెడ్డి గారి పాలమూరు న్యాయ యాత్ర…

జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారి సహకారంతో నేడు జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలంలోని కాకర్లపాడ్,రుద్రారం, నవాబ్ పేట్ గ్రామాలలో CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు, మాజీ జిల్లా అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి గారు పాలమూరు న్యాయయాత్ర నిర్వహించారు…

సందర్భంగా వంశీ చంద్ రెడ్డి గారు ఆయా గ్రామాలలోని దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాలమూరు’తో ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని గత ప్రభుత్వం చెప్పిందని, అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎక్కడా పనులు పూర్తి కాలేదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వా నితులు చల్లావంశీచంద్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు లోని 1.46 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని అబద్ధపు ప్రచారం పేర్కొన్నారు. ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపిం చినా ముక్కు నేలకు రాస్తానన్నారు.

‘పాలమూరు న్యాయయాత్ర’ 12వ రోజు శుక్రవారం జడ్చర్ల నియోజ కవర్గం పరిధిలోని నవాబుపేట మండలం ఫతేపూర్ మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉదండాపూర్ నిర్వాసితు లకు న్యాయం చేయాలని ఇటీవల అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలి పించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *