చారిత్రాత్మక కట్టడమైన పాలిటెక్నిక్ కళాశాలను అన్ని విధాలుగా బాగు చేసుకుందామని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు
వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న పురాతన బావికి జాలి ఏర్పాటు, ఉదయపు నడక కోసం వాకింగ్ ట్రాక్, రాత్రి సమయంలో కళాశాల ఆవరణలో పూర్తిగా చీకటి ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పట్టణ వాసులు పేర్కొనడంతో స్పందించిన ఎమ్మెల్యే హైమాస్ట్ లైట్లు సైతం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు
అనంతరం పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పరిశీలించారు.
అలాగే ఈ మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్యే గారు పట్టణవాసులతో మాట్లాడి వారితో కలిసి కాసేపు సరదాగా క్రికెట్ మ్యాచ్ ,ఫుట్బాల్ ,షటిల్ బ్యాడ్మింటన్ ఆటలను ఆడారు