నేడు రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారిని కలిసి పెబ్బేరు మున్సిపాలిటీ పట్టణంలో గల 6 పడకలు హాస్పిటల్ ను 30 పడకలుగా అప్డేట్ చేయాలని కోరారుజాతీయ రహదారినీ ఆనుకుని ఉన్న పెబ్బేరు పట్టణంలోని ఆసుపత్రికి అత్యవసర సేవల అవసరం ఎక్కువగా ఉంటుందని దాంతోపాటు పెబ్బేరు పట్టణంలోని 25 వేలకు పైగా జనాభా. ఉన్నారని వీటిని దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ ని 30 పడకలు గా అప్డేట్ చేయాలని ఎమ్మెల్యే గారు కోరారు.ఎమ్మెల్యే అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించిన మంత్రి గారు హాస్పిటల్ కి కావలసిన అన్ని వసతులను వీలైనంత త్వరగా ఏర్పాటుచేస్తానని మంత్రిగారు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి పేర్కొన్నారు.