పెబ్బేర్ విజయోత్సవ ర్యాలీ

పెబ్బేర్ విజయోత్సవ ర్యాలీలో నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి కలిసి పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు.

ఎంపీగా అఖండ విజయం సాధించి మొట్టమొదటిసారిగా వనపర్తి నియోజకవర్గానికి విచ్చేన నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు పెబ్బేరు జాతీయ రహదారి బైపాస్ వద్ద వారికి ఘన స్వాగతం పలుకుతూ భారీ బైక్ ర్యాలీతో పెబ్బేరు పట్టణానికి చేరుకున్నారు.

అనంతరం పెబ్బేరు సుభాష్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఎంపీ గార్లు ప్రసంగించారు

పెబ్బేరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా, మారుస్తామని పెబ్బేరు సంతకు సంబంధించిన భూమిని కాపాడుతామని, పెబ్బేరు పట్టణంలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించి తీరుతామని పెబ్బేరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సంయుక్తంగా కష్టపడతామని వారు పేర్కొన్నారు