తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పనిచేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను.. గుండెల్లో పెట్టి చూసుకుంటానని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారుకాంగ్రెస్ పార్టీ తరఫున తాను ఎన్నికల బరిలో ఉన్న సమయంలో కొన్ని గ్రామాలకు పోలేకపోయినా కొందరి కార్యకర్తలను కలవలేకపోయినా వారు గొప్ప మనసుతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.BRS పదేళ్ల పాలనలో సర్పంచుల బాగోగులను పట్టించుకోని ప్రభుత్వం నేడు సర్పంచుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు.అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో ఇలాంటి పరిస్థితి రాదు అన్ని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా @dr.mallu.raviగారు @shivasenareddyinc గారు ఎంపీపీలు, ఎక్స్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ,సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
