ప్రజాపాలన రైతు విజయోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన రైతు పండగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన @revanthofficial గారు డిప్యూటీ సీఎం @bhatti_vikramarka గారికి శాలువా కప్పి పూలగుచ్చం ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది..
రైతు పక్షపాతిగా రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ నేడు నాలుగో విడుత రుణ మాఫీ నిధులు విడుదల చేస్తూ ఈ ఏడాది కాలంలోనే దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా 54,280 కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం..

రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్న ఇంట్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు పాలమూరు జిల్లాలో లక్షల మంది రైతులతో కలిసి రైతు పండుగ చేసుకోవడం రైతు బిడ్డగా చాలా ఆనందకరం అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో లో జరుపుకోవడం చాలా ఆనంద కరం.
రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడలేకపోతున్నాం బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లుతుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో వరి ధాన్యాన్ని కొనకుండా రైతులను ఎంతో ఇబ్బంది పెట్టిందని ఇప్పుడు ఆ పరిస్థితి రైతులకు రాకుండా ప్రజా ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నాయి సభాముఖంగా తెలియజేయడం జరిగింది.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు,ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
