రెండు రోజుల్లో గుడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీటి విడుదల
వనపర్తి నియోజకవర్గంలోని గుడిపల్లి రిజర్వాయర్ ను పరిశీలిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు. అలాగే రిజర్వాయర్ సమీపంలో ఉన్న సమస్యలను అక్కడ ఉండే సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది.
వనపర్తి నియోజకవర్గం లోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. మరో రెండు రోజుల్లో గుడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీటి విడుదల చేస్తామని.సాగునీటిపరంగా అన్నదాతలు ఎవరు అధైర్య పడొద్దని అవసరమైతే సొంత నిధులతో కెనాలకు మరమ్మత్తు చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.