ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పించిన

భారతదేశానికి దిక్సూచిగా నిలిచి హక్కుల కోసం పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను భారతదేశంలోని ప్రతి గ్రామం, వాడ, పట్టణం అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.

•అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ గారు చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

•తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు…

మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి సామాజిక న్యాయం కోసం కృషి చేస్తోందని చెప్పారు.

డాక్టర్ అంబేద్కర్ గారి పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

•బాబాసాహెబ్ గారి స్వప్నాలను నిజం చేయడానికి అందరూ కలిసి పాటుపడాలని పిలుపునిచ్చారు