బెల్ట్ షాపుల నిర్వాహకులు, 1వ తేదీ లోపు తమ వద్ద ఉన్న స్టాక్ అంతా క్లియర్ చేసుకోవాలి…
ఫిబ్రవరి ఒకటవ తేదీ తర్వాత నుండి ఎవరైనా దొంగ చాటుగా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు…
జడ్చర్ల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో నేడు ఎమ్మెల్యే జనంపల్లి అఅనిరుధ్ రెడ్డి గారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో గంజాయి మరియు బెల్ట్ షాపుల నివారణకు సంబంధించి సమావేశం నిర్వహించారు….
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత నుండి గ్రామాలలో దొంగచాటుగా
మద్యం విక్రయించే వారి గురించి సమాచారం అందిస్తే, సమాచారాన్ని అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచి, నా వంతుగా 10,000/- నజరానాను అందిస్తానని అన్నారు….
గంజాయి దొరికితే సహించేది లేదు విక్రయించే వారిని విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు…
జిల్లా ఎస్పీ సహకారంతో నియోజకవర్గంలో మద్యం అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు…
చట్టాన్ని అతిక్రమించేవారు ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా తమ పార్టీ వారైనా సహించేది లేదని తెలిపారు.చట్ట వ్యతిరేకులకు నా సహకారం ఉండదని అన్నారు…
అందరూ చట్టానికి లోబడి చట్టాన్ని గౌరవిస్తూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జీవించాల్సిందేనని తెలిపారు…
#Jadcherla