బాధితుల కుటుంబాలకు వెళ్లి చెక్కుల పంపిణీ

వనపర్తి శాసన సభ్యులు గౌరవ ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి గారి ఆదేశానుసారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్ సాయిచరణ్ రెడ్డి మరియు కాంగ్రెస్ మండల నాయకులు నేరుగా ఇంటికి వచ్చి సీఎం సహాయక చెక్కులు అందజేయడం చేయడం జరిగింది

గౌరవ ఎమ్మెల్యే ఆదేశాలతో ఖిల్లాగణపురం మండలంలో అనేక రకాల ఆరోగ్య పరిస్థితివల్ల పేద ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు బాధితుల కుటుంబాలకు వెళ్లి చెక్కులను అందజేయడం జరిగింది

లబ్దిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే మెగారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు