భక్తి శ్రద్ధలతో సాగిన ఈద్ మిలాద్ ఉన్ నబి శోభాయాత్ర

తెల్లాపూర్ మున్సిపాలిటీ… ఆదివారం రోజున భక్తిభావంతో ఉప్పొంగింది. ప్రవక్త ముహమ్మద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం యువత ఆధ్వర్యంలో జష్నే ఈద్ మిలాద్ ఉన్ నబి శరీఫ్ శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా, పటాన్చెరు బీఆర్ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ గారు తమ సేవాభావాన్ని చాటుకున్నారు.