మండల స్థాయి సమావేశంలో మేఘారెడ్డి గారి సందేశం

వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు శుక్రవారం ఖిల్లా ఘణపురంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

కార్యకర్తలు, నాయకులను తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, ఎవరు కూడా అధైర్యపడవద్దని ఆయన సూచించారు. గ్రామాల వారీగా సమస్యలను తెలుసుకుని, వీలైనంత త్వరగా పరిష్కరించాలని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చడంలో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సాయి చరణ్ రెడ్డి గారు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు నాయకులూ పాల్గొన్నారు.