వనపర్తి జిల్లా ఘణపురం మండలం సల్కెలాపురం గ్రామంలో ప్రజాపాలనకు సంబంధించి గ్రామసభలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి గారు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి

గ్రామస్థులు ఘన స్వాగతం అందించారు.
ఈ కార్యక్రమానికి సాయి చరణ్ రెడ్డి గారు ఆధ్వర్యం వహించగా, నేతలు గ్రామంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఎద్దుల బండిపై ఊరేగింపు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో గ్రామ ప్రజలు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గ్రామస్థుల సాంప్రదాయ విలువలతో పాటు నేతల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించింది.
ఈ కార్యక్రమంలో ఖిల్లా ఘనపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామా ప్రజలు తదితరులు పాల్గినడం జరిగింది.
