తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిగా వ్యవహరించి నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు మరియు అచ్చంపేట నియోజకవర్గంలో నా యొక్క గెలుపుకు పార్టీ నుండి పూర్తి సహాయ సహకారం అందించిన మాణిక్ రావు ఠాక్రే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపడం జరిగింది.

మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా వసీం పార్లమెంట్ పరిధిలోని యావత్ మాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్ లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది యావత్ మాల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల సాహెబ్ మంగుల్కర్ గారితో కలిసి నియోజకవర్గ బూత్ లెవెల్ సమీక్ష సమావేశం నిర్వహించారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.