సురక్ష త్రాగునీరు విద్యార్థుల రక్ష.
మిడ్జిల్ మండల కేంద్రంలో ZPHS మరియు ప్రాథమిక పాఠశాలలో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…

సందర్భంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రవేట్ పాఠశాలలో ఉండరని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలని కోరారు.
అలాగే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలోని 53 వేల మంది విద్యార్థులకు నా సొంత నిధులతో షూలు ఇప్పించడం జరుగుతుందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలోనీ విద్యార్థులందరూ సక్రమంగా విద్యాభ్యాసం కొనసాగించి ఉన్నత స్థాయిలను అధిరోహించాలని కోరారు.
