వనపర్తి అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ.నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించాడానికి ముఖ్యమంత్రి నిధుల మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారువనపర్తి పట్టణంలోని కాలేజీలను,పాఠశాలను,జూనియర్ కాలేజీలను, పాలిటెక్నిక్ కళాశాల,అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహకారాలను అందించాలని ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారు కోరారుఅందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు వనపర్తి లోని విద్య సంస్థల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన హామీ ఇచ్చారు.అలాగే తాను విద్యను అభ్యసించిన వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెప్పిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ వనపర్తి అభివృద్ధికి అన్ని రకాలుగా పూర్తిస్థాయిలో సహా సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.