మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యఅతిథి CWC ప్రత్యేక అహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు,ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు మరియు సహచర ఎమ్మెల్యేలు…
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి నేడు ముఖ్యఅతిథి CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు హాజరయ్యారు…

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
గత బిఅర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ప్రాంతాన్ని పూర్తిగా అవినీతిమయం చేశారని అన్నారు. ఎక్కడ చూసినా భూకబ్జాలకు పాల్పడుతూ మహబూబ్ నగర్ ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.
మేము ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే దానికి ముఖ్య కారణం కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితమేనని అన్నారు. మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్లప్పుడూ మా గుండెల్లో ఉంటారని తెలిపారు.
గత 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో మహబూబ్ నగర్ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలను ఏ విధంగా కష్టపడి గెలిపించారో అదే విధంగా కష్టపడి పనిచేసి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మహబ్ నగర్ జిల్లా ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు…
#Mahabubnahar
