ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు

మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించుకునే మిలాద్-ఉన్-నబీ సందర్భంగా వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్ లో గల మహమ్మదీయ మసీదులో చేపట్టిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా అందుకు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇవ్వడం జరిగింది…