అడ్డాకుల మండలం పెద్ద మునగలచేడు గ్రామం నుంచి శుక్రవారం భారీ ఎత్తున BRS పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో స్థానిక నాయకుల ఆకాంక్ష మేరకు వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
పెద్ద మునగలచేడు గ్రామం నుంచి సింగిల్ విండ డైరెక్టర్ జ్యోతి సంజీవరెడ్డి గారితో పాటు దాదాపు 100 మంది BRS కార్యకర్తలు నాయకులు.. చిన్న మునగాలచేడు గ్రామం నుంచి గ్రామ మాజీ సర్పంచ్ కనకయ్య గ్రామ మాజీ ఉపసర్పంచ్ బంగ్లా నాగభూషణం తో పాటు మరో 40 మంది
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..
పెద్ద మునగాలచేడు, చిన్న మునగలచేడ్ గ్రామాల అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన డాక్టర్ మల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు