గోపాల్ పేట్ మండల కేంద్రంలో హనుమాన్లగడ్డకు చెందిన మూవీ డైరెక్టర్ కోమరి జానకిరామ్ ఆర్థిక సమస్యలతో గురై 05-08-2024 సోమవారం రోజున హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ విషయం తెలుసుకున్న గోపాల్ పేట్,రేవల్లి మండలాల ఇంచార్జ్ మందా సత్య శీల రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దృష్టికి తీసుకువచ్చాడు వారు నేరుగా జానకిరామ్ స్వగృహానికి వచ్చి తల్లి అనంతమ్మ ను ఓదార్చి భరోసా కల్పించి వారి కుటుంబ సభ్యుల మనో ధైర్యం కల్పించి తన వంతు గా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అనంతమ్మకు 20,000/- ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.