మెగా మెడికల్ క్యాంపు

ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రం లో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఖిల్లా ఘనపూర్ యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో SVS మెడికల్ కళాశాల వైద్యులు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన రోగులకు డాక్టర్ భరత్ నందన్ రెడ్డి పర్వేక్షణలో సుమారు 33 మంది విద్య సిబ్బంది కలిసి విద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేసారు.అదేవిదంగా మన ఖిల్లా ఘనపూర్ యువ నాయకుడు రక్త దానం చేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటయ్య, PACS మాజీ చైర్మన్ మురళీధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, పెద్ద మందాడి మండలం సమన్వయకర్త తుడి శ్రీనివాస్ రెడ్డి, రాములు నాయక్, రవి నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులూ పాల్గొన్నారు