- తన స్వంత నిధులతో మరమ్మతులు చేపట్టారు.
- ప్రయాణికులకు నేనున్నానంటూ భరోసా.
ఊర్కొండ:
రాచాల పల్లి-మాధారం మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. బస్సులు రాక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. BT రోడ్డు మంజూరు అయిన టెండర్లు దశ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దాంతో ప్రయాణికులు మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారి దృష్టికి తీసుకువెల్లగా నేనున్నానంటూ భరోసా కల్పించి రోడ్డు మరమ్మతులు తన స్వంత నిధులతో చేపట్టారు. నాయకులు అంటే ఇలా ఉండాలి అడిగిన వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి బస్సుల రవాణా సౌకర్యం కల్పించడంలో ముందుకు వచ్చిన రియల్ హీరో DNR గారు అని ఆయా గ్రామాల పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మన అభిమాన నాయకులు, మన ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు ఈ రోడ్డును బీ టీ రోడ్డుగా మార్చడానికి నిధులు మంజూరు చేయించారు. అవి టెండరు దశలో ఉంది. కావున అప్పటివరకు రవాణా సౌకర్యం మెరుగు పరచడానికి తనవంతు కృషి చేశానని ఈ సందర్భంగా  తెలియజేశారు.