రాష్ట్రంలో BRS పార్టీ ఖాళీ అవడం ఖాయం…

MLC ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ,MLC అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి తోపాటు కలిసి పాల్గొన్నారు.స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు.MLC ఎన్నికల సన్నాక సమావేశంలో భాగంగా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సమావేశంలో ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్లోకి ప్రజా ప్రతినిధులను గాని, మంత్రులను గాని రానివ్వకుండా చేశారని నేడు నిరుపేదలు సైతం ప్రజా భవన్ ( ప్రగతి భవనకు) ధైర్యంగా వెళ్లి వారి సమస్యలను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నారని మంత్రి అన్నారు. అలాగే రాష్ట్రంలో BRS పార్టీ పరిస్థితి మునిగిపోతున్న నావల తయారయ్యిందని మరి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘ రెడ్డి గారు మాట్లాడుతూ ….వనపర్తి నియోజకవర్గం లో 117 ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారని ప్రతి ఇంట్లో 100కు పైగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.BRS పార్టీకి వనపర్తి నియోజకవర్గంలో మనుగడ లేదని నేడు ఆ పార్టీని ఎవరు నమ్మడం లేదని రాష్ట్రవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది అని ఆయన వ్యాఖ్యానించారు.