ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ఉంచి వారిలో ఉన్న రక్తహీనతను గుర్తించి శరీరంలో హిమోగ్లోబిన్ శాతంను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం(RBSK) వనపర్తి కస్తూర్బా గాంధీ పాఠశాలలో నిర్వహించిన అనీమియా ముక్తి తెలంగాణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని అలాగే ప్రతి ఒక్క విద్యార్థి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో (RBSK) వైద్యులు రఘు, స్వప్న,ANM లక్ష్మి,శ్రీవిద్య పాఠశాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.