రేవల్లి మండలంలో ప్రజాపాలన కార్యక్రమం

రేవల్లి మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ఆ గ్రామం యొక్క ప్రభుత్వ పాఠశాలను పరిశీలిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తు నేడు చివరి రోజు కాదు రేపటినుంచి కూడా దరఖాస్తు చేసుకునేవారు వారి మండలాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. అలాగే రేవల్లి మండలం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పిల్లలతో పాఠశాల యొక్క సమస్యలను తెలుసుకున్నారు.