రైతులు ఆందోళన చెందవద్దు.. నీట మునిగిన భూముల పరిశీలన…

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాల సముద్రం పూర్తిగా నిండడంతో బ్యాక్ వాటర్ తమ పంట పొలాలను ముంచేస్తుందని పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ రైతులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

అందుకు సానుకూలంగా స్పందించి మద్దిగట్ల గ్రామ రైతులతో కలిసి నీటి మునిగిన భూములను పరిశీలించారు .

నూతనంగా నిర్మించిన చెరువు కట్ట నిర్మాణంలో అలుగును పెంచారని దాంతో తమ పొలాల్లోకి చెరువు నీరు చేరిందని రైతులు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతుకు పొలాల్లోకి నీరు రావడానికి గల కారణం తెలుసుకొని తగు చర్యలు చేపట్టి.. రైతులకు సహకరించాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించడం జరిగింది.