జడ్చర్ల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి గారు మరియు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు హాజరయ్యారు…
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు మాట్లాడుతూ…
మన పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశన్న కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారన్నారు.
జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి 160 పైచిలుకు కోట్ల బడ్జెట్ రావడానికి వంశన్న కృషి చేశారని అన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన మహబూబ్నగర్ అభ్యర్థి వంశన్నను గెలిపించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మన మహబూబ్నగర్ జిల్లాకు నిధులు తీసుకొచ్చి మన జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి కృషి చేస్తారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థి వంశన్నను భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు