వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన: సాయి చరణ్ రెడ్డి

గౌరవ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారి ఆదేశానుసారం ఖిల్లా ఘనపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులూ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

రోజు ఖిల్లా ఘనపూర్ మండలంలో ఉన్న సల్కాలపురం, మామిడిమాడ, మామిడిమాడ వెనికి తండా, ముందరి తండా, కర్నె తండా, షాపూర్, ఆముదబంధ తండా, ఘనపూర్, సోలీపూర్, ఉప్పరపల్లి, సూర్రాయపల్లి గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులూ. అదేవిదంగా మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి గారు స్థానిక రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని రైతుల సంక్షేమం మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రెవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం ₹500 బోనస్‌ను అందిస్తున్నట్లు సాయి చరణ్ రెడ్డి గారు తెలియజేసారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సాయి చరణ్ రెడ్డి గారు, క్యమా వెంకటయ్య గారు, వెకేట్రావు గారు, రాములు నాయక్ గారు , ప్రకాష్ గారు, బాబు గారు తదితరులు పాల్గొన్నారు