వనపర్తి జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి స్థలం పరిశీలించడం జరిగింది.
వనపర్తి జిల్లా ఇంటర్మీడియట్ స్థాయి స్థాయి వరకు స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చాయని అందుకు సరిపడా కనీస 25 ఎకరాల స్థలం కేటాయించాలని వారిని కోరడం జరిగింది.
స్పందించిన కలెక్టర్ వనపర్తి జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అనువుగా ఉన్న ప్రభుత్వ భూములను గూగుల్ మ్యాప్ ద్వారా చూపించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం లోని స్థలాన్ని, అయ్యవారి పల్లి వద్ద ఉన్న స్థలాన్ని, పోలేపల్లి, నాగవారం స్థలాలను చూడడం జరిగింది.
అలాగే పెబ్బేరు మండలంలోని ఉన్న కొన్ని ప్రభుత్వ స్థలాలను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి MRO లక్ష్మి గారితో కలిసి స్థలాలను పరిశీలించడం జరిగింది.
అనంతరం నాగవరం మెడికల్ కళాశాల వద్ద ఉన్న స్థలాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారితో కలిసి పరిశీలించడం జరిగింది ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అనువుగా ఉందని కనీసం 25 ఎకరాల స్థలం కేటాయించాలని కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది