ఊర్కొండ:
జడ్చర్ల మున్సిపాలిటీ నుంచి గత నెల అక్టోబర్ 15 న జడ్చర్ల కు చెందిన దాదాపు 35 మంది అయ్యప్ప స్వాములు మాలధారణ ధరించి పాదయాత్రగా జడ్చర్ల నుంచి శబరిమలకు బయలు దేరారు. ఈ విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు అయ్యప్ప స్వాములకు 20 వేలు రూపాయలు పాదయాత్ర ఖర్చులకై ఇచ్చినట్లు అయ్యప్పస్వాములు వెల్లడించారు.
DNR గారికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని శబరి అయ్యప్ప స్వామికి ప్రార్ధిస్తామని వారు పేర్కొన్నారు