
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి రాయల గండి జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి. పదరా మండలం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం రాయలగండీ బ్రహ్మోత్సవాలు జాతర ఏర్పాట్లు పై సంబంధిత శాఖ అధికారులు మరియు దేవస్థాన కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించడం జరిగింది.
మార్చి 4వ తేదీ నుండి జరిగే శ్రీ రాయల గండి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, దేవాదాయ, ఇరిగేషన్ ,పంచాయతీ రాజ్, హెల్త్, పోలీస్ ,సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది.
జాతరకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సౌకర్యం ఇతర వసతులు కల్పించాలి , ఐదు రోజులపాటు జరిగే ఈ యొక్క జాతర కు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరవుతున్నారు కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించదమైనది.