పెద్దమందడి మండలంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు పాల్గొని ప్రజాప్రతినిధులను సన్మానించి, శాఖలపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
పదవీకాలం తాత్కాలికమని ప్రజా ప్రతినిధిగా ఒక్కసారి ఎన్నికైతే సమాజంలో ఎప్పటికీ ప్రజా సేవకుల గానే మిగిలిపోతామని ఎక్కడ ఎవరు అసంతృప్తి చెందకుండా ప్రజాక్షేత్రంలో ప్రజాసేవను చేస్తూనే ఉండాలని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరున ప్రజాధనం వృధా చేసింది తప్ప ప్రజలకు తాగునీటి సమస్యలు తీర్చలేదని నేడు నియోజకవర్గంలో కేవలం తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకే 3కోట్ల 60 లక్షలు ప్రత్యేకంగా కేటాయించామని అధికారులు తాగునీటిపరంగా ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు
అలాగే వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సాగు చేసిన పంటలను పక్కాగా నమోదు చేయించాలని సాగుచేసిన ప్రతి రైతు ప్రభుత్వం తరఫున లబ్ధి పొందేలా చూడాలని చెప్పడం జరిగింది
సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సీజనల్ వ్యాధులను సంక్రమించకుండా తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించడం జరిగింది.
గ్రామాల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు వేతనాలు క్రమం తప్పకుండా అందించాలని ఎక్కడ జాప్యం రాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు.
అలాగే పదవీకాలం ముగుస్తున్న ఎంపీటీసీలను శాలువా కప్పి పూల మాలలతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పెద్దమందడి ఎంపిపి రఘు ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ భారతి, ఎంపీడీవో సద్గుణ, సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు ప్రజాప్రతిని అధికారులు తదితరులు పాల్గొన్నారు