జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1948, సెప్టెంబరు 17న రాచరిక పాలన ముగిసి తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరంసెప్టెంబర్ 17ను “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట పట్టణంలోని జండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది.

తెలంగాణ సాయుధ రహితంగా పోరాట స్ఫూర్తితోనే ప్రజా పాలన దినోత్సవం గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా జరుపుకుంటున్నారు తెలంగాణ లో ప్రజా పాలన మొదలై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఈ యొక్క ప్రజాపాలనకు నిదర్శనం .
ప్రజా ప్రభుత్వం లో ప్రజలందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల లబ్ధి పొందుతున్నారు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం మరియు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆర్డీవో కార్యాలయం ఎమ్మార్వో కార్యాలయం ముందు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.