శనివారం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన 1987–1988 పదవ తరగతి తన బ్యాచ్ మెంట్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తులు ఎన్ని ఉన్నా ఆత్మీయులెందరున్న స్నేహబంధం ముందు ఏవి సాటి రావని బాల్య మిత్రుల బంధం కలకాలం బలంగా ఉంటుందని బాల్యంలో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా కలిసికట్టుగా ఉండే వాళ్ళమని భవిష్యత్తులో ఎన్ని పరిచయాలు ఏర్పడిన బాల్యమిత్రులు మాత్రం చిరస్థాయిగా గుర్తిండి పోతారని ఆయన అన్నారుఅనంతరం మిత్రులందరు ఒకరికొకరు పరిచయ కార్యక్రమం చేపట్టి శాలువాలతో పూల మాలలతో ఎమ్మెల్యే గారిని సత్కరించారు. మిత్రులందరితో కలిసి భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు.