జిల్లెళ్ల యువకుడికి నెరవేరిన రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ..

ఏఐసీసీ అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీని నెరవేర్చిన కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి గారు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ గారు కల్వకుర్తి మండలం జిల్లెళ్ల గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రైతు చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆయన కుమారుడు నితిన్ కి ఆటో అందజేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ నితిన్ కి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు ఆటో అందజేశారు. ఈ సందర్భంగా తల్లి తిరుపతమ్మ హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బాలాజీ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ బృంగి ఆనంద్ కుమార్ అన్న గారు, జిల్లెళ్ల రాములు అన్న గారు, శ్రీ ఆశాదీప్ రెడ్డి గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.