ప్రజా అభివృద్ధి, సంక్షేమం లో మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం

ప్రజా అభివృద్ధి, సంక్షేమం లో మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా రాజపేట గ్రామం, నాగవరం లో మహాలక్ష్మి పథకం ను ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రారంభించారు. రాజపేట నుండి నాగవరం వరకు మహిళలతో కలిసి బస్సు ప్రయాణం చేశారు. వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన తూడి మేఘా రెడ్డి కి వనపర్తి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి స్వాగతం పలికి, 800 మోటర్ సైకిల్ లతో పుర వీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి రాజు ఆరోగ్య శ్రీ పథకం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 48 గంటలలో ఎన్నికల హామీలను/ గ్యారెంటీలను అమలు చేయడం ప్రారంభిం చిందన్నారు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు.పేద ప్రజలకు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం 5 లక్షల రూపాయల నుంచి పది లక్షలకు పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల ఎంపీపీ కిచ్చా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రహీం, సతీష్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటయ్య యాదవ్, నసీర్ , తదితరులు పాల్గొన్నారు.