రాష్ట్రప్రభుత్వం ప్రజలకు మంచి నీరు, విద్యుత్, రహదారులు వంటి మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే తూడీ మేఘా రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 14వ, 21వ, 22వ, 25వ, 31వ వార్డులలో ఎమ్మెల్యే తూడీ మేఘా రెడ్డి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చీర చందర్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటయ్య యాదవ్, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి, పురకౌన్సిలర్లు వెంకటేష్, బ్రహ్మం, చీర సత్యం సాగర్, ప్రజాప్రతినిధులు, నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.