వనపర్తి నియోజకవర్గంలో ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆత్మగౌరవానికి పట్టం కట్టారని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడీ మేఘా రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే అధికార నివాసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే తూడీ మేఘా రెడ్డి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తూడీ మేఘా రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలలో అభివృద్ధి మాటున అవినీతి, భూ కబ్జా పై విచారణ జరిపి దుర్వినియోగమైన ప్రజాధనాన్ని ప్రజలకు పంచుతామన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన బినామీ వ్యక్తుల పేర్ల పై దాదాపు వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
వివిధ శాఖల ద్వారా చేప్పట్టిన అభివృద్ధి పనుల్లో అవినీతిని విచారణ జలిపి బట్టబయలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ లకు సిద్ధంగా ఉండాలన్నారు. వనపర్తి నియోజకవర్గం ప్రజలు అహంకార నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా ప్రజా తీర్పు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంను ప్రజాభవన్ గా నామకరణం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రతి వారం ప్రజాభవన్ లో ప్రజల సమస్యలను పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి, వార్డులో, గ్రామంలో గుడ్ మార్నింగ్ వనపర్తి పేరు పై పర్యటించి ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులను చేపడతామన్నారు. ఈ మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, కౌన్సిలర్ సత్యం సాగర్, కాంగ్రెస్ నాయకులు సతీష్, తదితరులు పాల్గొన్నారు.
