లక్ష్య సాధనలో అంగవైకల్యం అడ్డు కాకూడదు : ఎమ్మెల్యే

లక్ష్య సాధనలో అంగవైకల్యం అడ్డు కాకూడదనీ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఐడిఓసి సమావేశ మందిరంలో మహిళా శిశు వికలాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే తూడి పవార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి ప్రారంభించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన దివ్యాంగ క్రీడాకారులకు బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి పవార్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దివ్యాంగుల సంక్షేమ భవన్ కు స్థలం కేటాయిస్తామన్నారు. వైకల్యం ప్రతిభకు అడ్డు కాకూడదని, దివ్యాంగులు శ్రమతో అద్భుతాలు సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పరంగా అందుతున్న సంక్షేమ పథకాలు దివ్యాంగులకు చేరేలా అన్ని చర్యలు చేపడుతున్నామని సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, వనపర్తి ఎంపీపీ కిచ్చా రెడ్డి, డి డబ్ల్యు ఓ రామా మహేశ్వర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్మన్, సభ్యులు వెంకటరమణమ్మ, రాజేంద్రప్రసాద్, డిఆర్డిఓ నరసింహులు, అడిషనల్ డిఆర్డిఓ రేణుక, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.