గణప సముద్రంలో భూములు కోల్పోయిన బాధితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇందిరమ్మ రాజ్యంలో పార్టీలకతీతంగా ప్రజాపాలన కొనసాగుతుందని అభివృద్ధి పథకాల అమలులో అందరూ సమానమే అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఖిల్లా గణపురం మండల కేంద్రం లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారుగత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం తమకు అనుకూలమైన వారికి తమ పార్టీ వారికే ప్రధాన ఇచ్చేవారని నేడు అలాంటి దుస్థితి రాదని ప్రభుత్వ పథకాల అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని చెప్పారు.ఘణపురం గణపసముద్రం రిజర్వాయర్ ఏర్పాటు లో భూములు కోల్పోయే ప్రతి రైతుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన రిజర్వాయర్ల ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు ఎంత నష్ట పరిహారం చెల్లించారో అంత నష్టపరిహారం ఖిల్లా ఘనపురం రైతులకు కూడా చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఒక్కొక్క రోజు వేల సంఖ్యలో దరఖాస్తు వస్తున్నాయని వీటన్నింటిని పరిశీలించి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపడతామని ఆయన అన్నారుగత పాలకులు కేవలం మాటలతోనే అభివృద్ధి పదాన్ని చూపించారే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం వలన ఈ దరఖాస్తుల వేళల్లో కొనసాగుతుందని ఆయన విమర్శించారుకాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరమణ. మాజీ జెడ్పిటిసి సభ్యులు సోలిపురం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, డిప్యూటీ సర్పంచ్ యాదగిరి వార్డు సభ్యులు జన్మ మధు బాల్రెడ్డి మన్నెమ్మ లింగస్వామి, తాసిల్దార్ పాండు ఎంపీఓ రాజు, ఏవో మల్లయ్య పంచాయతీ కార్యదర్శి రవితేజ రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..