రాముల వారి అక్షింతలు పంచముఖి ఆంజనేయస్వామి ఆలయం లో సమర్పించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రాముల వారి విగ్రహాల ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా రాములవారి అక్షింతలను పంపిణీ చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆదివారం వనపర్తి పట్టణంలోని 9 వార్డ్ విద్యానగర్ కాలనీలో రాములవారి అక్షింతలను తలపై మోస్తూ ఊరేగింపుగా వెళ్లి పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.అనంతరం ఆలయంలోని పంచముఖి ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ప్రాగాణంలో పూల మొక్కలు నాటారు.