వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి జన్మదిన సందర్భంగా వివిధ మండలాలలో గ్రామాలలో రక్తదాన శిబిరం ప్రారంభించడం జరిగింది.నేడు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పెబ్బేర్, ఖిల్లా ఘనపూర్, పెద్దమందడి, వెల్టూర్, నంది హిల్స్ లో చేపట్టిన రక్తదాన శిబిరాలను ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే వివిధ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు,పండ్లు,బ్రెడ్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చెయ్యాలని రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు కాపాడిన వారిమవుతామని అలాగే మన రక్తం కూడా శుద్ధి అవుతుం దని మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని దీని వలన ఎలాంటి సమస్య రాదు అని ఆయన పేర్కొన్నారు.అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.