వీరశైవ జంగమ అర్చక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఎమ్మెల్యే గారికి వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారుఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బ్రాహ్మణుల లోను నిరుపేదలుగా ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చేయడంతో పాటు వారికి ఇందిరమ్మ గృహాలను సైతం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు వీరశైవ జంగమ అర్చక సంఘం భవన నిర్మాణానికి వనపర్తి పట్టణ లో స్థలం కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ నందు మఠం శశిభూషణ సిద్ధాంతి,శివశ్రీ సురేష్ శాస్త్రి, కోటీశ్వర శాస్త్రి ,నటరాజ్ శాస్త్రి ,ప్రకాష్ శాస్త్రీయతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన అర్చకులు ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని అర్చకులు పాల్గొన్నారు .అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు