శివ స్వాముల అన్నదానానికి లక్ష రూపాయలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు

వనపర్తి పట్టణంలోని సోమవారం ఉదయం చింతల హనుమాన్ ఆలయంలో గల శివాలయాన్ని దర్శించుకుని ఆయన శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయంలో ఉన్న శివమల దీక్షపరులకు నిత్యాన్నదానానికి సంబంధించి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు.అనంతరం శివమాల దీక్ష చేపట్టిన స్వాములతో ఆయన మాట్లాడారు.