పెబ్బేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారుతీవ్ర స్థాయిలో స్పందించి తక్షణమే అధికారులను సహాయక చర్యలను తీసుకోమని ఆదేశించడం జరిగింది. ప్రమాదం జరిగిందని విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ తో సహా సంబంధిత అధికారులు అందరినీ అప్రమత్తం చేశారుమంగళవారం ఉదయం ఆయన మార్కెట్ యార్డును సందర్శించి పరిశీలించారు మార్కెట్ యార్డులో దద్దమైన వరి ధాన్యం బస్తాలను ఆయన పరిశీలించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని తగు చర్యలు తీసుకుంటామన్నారు.ప్రమాదం ఆకస్మికంగా సంభవించిందా ఎవరైనా కావాలని చేశారా.. అనే దానిపై పూర్తి విచారణ చేస్తున్నామని విచారణలో కారణాలు వెళ్లడైన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారుప్రస్తుతం జరిగే వరి ధాన్యం కొనుగోలు లలో రైతులకు గన్ని బ్యాగుల విషయంలో ఎలాంటి ఆందోళన వద్దని ఉన్నతాధికారులతో మాట్లాడి గన్ని బ్యాగులను ఏర్పాటు చేస్తామని ఆయన సూచించారుఇప్పటికే పూర్తిస్థాయిలో తగు చర్యలు చేపట్టామని ఇంకా గోదాంలో మంటలు చెలరేగుతున్నాయని మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకునేందుకు నిరంతరాయంగా చర్యలు చేపట్టామన్నారు.
