నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశం ఆయన పాల్గొని మాట్లాదుతు 40 రోజులు మనందరం నిర్విరామంగా కష్టపడి మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన డాక్టర్ మల్లు రవి గారిని ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీ స్థాయిలోనూ మనం అధికారంలో ఉంటామని దాంతో అన్ని రకాల అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారుMP ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించేందుకుప్రతి ఒక్కరం పాటుపడదాంరాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఎజెండా గా పనిచేద్దాం.అన్ని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.. అలాగే నేడు పంటలు ఎండి రైతులు పడుతున్న గోసకు BRS పార్టీ నే ప్రధాన కారణం అని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు.మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో BRS పార్టీ ప్రజల నుండి ఓట్లు దండుకోవడానికి నానా రకాల ప్రలోభాలకు గురిచేసిందని ఈ క్రమంలోనే రైతులకు అవసరం లేకున్నా రిజర్వాయర్లలోని నీటిని అనవసరంగా దిగువకు వదిలి వృధా చేశారని… వారు చేసిన పాపం వల్లనే నేడు పంటలకు నీరందక పంటలు ఎండిపోయి రైతులు అల్లాడిపోతున్నారని ఆయన పేర్కొన్నారుముందు చూపు లేని ఆలోచనలతో నీటిని వృధా చేసి నేడు ప్రజల ముందు నీతులు వల్లిస్తున్నా BRS పార్టీ నాయకులకు మాట్లాడే హక్కు లేదని ఆయన విమర్శించారు.