ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల ఫైనల్ మ్యాచ్ ను వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘ రెడ్డి గారు ప్రారంభించారు.

పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల ఫైనల్ మ్యాచ్ ను వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘ రెడ్డి గారు ప్రారంభించారు. క్రీడలతో అంతర్జాతీయ గుర్తింపును పొందవచ్చునని క్రీడలు మానసికో ల్లాసానికి, దేహదారుధ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘ రెడ్డి గారు అన్నారుగ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొనిగత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీలలో మొత్తం 23 జట్లు పాల్గొన్నాయని, ఇందులో ఫైనల్ మ్యాచ్లో కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం పడక్కల్ గ్రామానికి చెందిన జట్టు, వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామ ఆర్కే టైటాన్స్ జట్లు తలపడ్డాయిఇందులో చిన్నమందడి గ్రామం ఆర్కే టైటాన్స్ మొదటి విజయం సాధించగా పడక్కల్ గ్రామానికి చెందిన జట్టు రెండవ స్థానంలో నిలిచింది.