కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

రేవల్లి మండలంలోని చెన్నారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రేవల్లి, గోపాల్పేట రెండు మండలాల కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు.ఎమ్మెల్యే గారు మాట్లాడుతూరాబోయే ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కు ఓటు వేస్తే చెత్త బుట్టలలో వేసినట్లేనని.. శ్రీరాముడు మనందరికీ దేవుడు బిజెపి పార్టీ వారికే మాత్రమే కాదని వనపర్తి జిల్లా ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల పంపిణీ పథకం మోసపూరితమైనదని ఎవరికైనా ఇంకా డబ్బులు రావాల్సి ఉంటే రెండు మూడు రోజులలో ఇప్పిస్తానని అన్నారు..తొందరలోనే రైతుబంధు అందరికీ జమ చేస్తామని, అదేవిధంగా పెన్షన్ 4000 అందిస్తామని, మహిళా సంఘాలకు 2500 రూపాయలు,3500 ఇండ్ల తో పాటు అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా చర్యలు చేపడతామని ఆయన అన్నారు.అదే విధంగా చనిపోయిన వారికి అందజేసే ఆర్థిక సహాయం ఎట్టి పరిస్థితుల్లోను ఆపమని కొంతమంది ఆపమని చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ప్రజలకు తెలిపారు. రాబోయే రోజులలో నిజాయితీగా పార్టీ కోసం కష్టపడిన వారికే సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ పదవులు దక్కుతాయని పోయిన ఎన్నికలలో నన్ను గెలిపించి సెమీఫైనల్ గెలిచామని వచ్చే ఎన్నికలు ఫైనల్ మ్యాచ్ లాంటివని ప్రజలందరూ మల్లు రవిని 40 వేల భారీ మెజార్టీ అందించాలని వారిని కోరారు. గ్రామాల వారిగా నిర్వహించిన సమీక్షలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సా నాయకులు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి మేఘ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు