మే డే జెండా ఆవిష్కరణ

మే డే సందర్భంగా కార్మికులు ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి పట్టణం బసవన్న గడ్డలో కార్మికులు ఏర్పాటు చేసుకున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన కార్మికులతో జెండా ఎగుర వేయించి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వనపర్తి మార్కెట్ హమాలి సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు వారి సమస్యలను ఆయన తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండదండగా ఉంటుందని ఆయన అన్నారు